
నిజామాబాద్: పంట కాలువలో పడి మహిళ మృతి
ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేతి లక్ష్మి అనే మహిళ పంట కాలువలో పడి మృతి చెందింది. ఏప్రిల్ 1న నిజామాబాద్ వెళ్తానని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదని, పంట కాలువలో తన తల్లి మృతి చెంది ఉన్నట్టు నాగయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేసారు. దీంతో శుక్రవారం పోలీసులు కేసు చేసి నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.