చీర గొంతుకు చుట్టుకొని బాలుడి మృతి
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో శుక్రవారం ఠాణాకలాన్కు చెందిన నవదీప్ (14) మెడకు ప్రమాదవశాత్తు చీర చుట్టుకోవడంతో మృతి చెందాడని ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం నవదీప్ సామాన్లు సర్దేందుకు చీర సాయంతో సజ్జపైకి ఎక్కాడని, దిగే క్రమంలో ప్రమాదవశాత్తు చీర మెడకు చుట్టుకోవడంతో బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలియజేశారు.