నూతన గ్రామ కమిటి ఎన్నిక
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో నూతన కమిటీని గ్రామస్తుల ఆధ్వర్యంలో సోమవారం ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ 14 మంది సభ్యులతో ఉంటుంది. అందులో శ్యామల అంజని కుమారును అధ్యక్షులుగా, కట్ట లక్ష్మయ్యను కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు