సీఎం నినాదాలతో మార్మోగిన ఎన్టీఆర్ భవన్‌

77చూసినవారు
టీడీపీ చీఫ్ చంద్రబాబు రాకతో మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో సందడి నెలకొంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. రేపు ఎన్నికల ఫలితాలు వెల్లడికాబోతున్న నేపథ్యంలో గెలుపుపై పార్టీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. సంబరాలు రేపు చేసుకుందామని.. శక్తిని అప్పుడే ఖర్చు చేసుకోవద్దంటూ శ్రేణులతో చంద్రబాబు చమత్కరించారు.

సంబంధిత పోస్ట్