నల్లమల అడవుల్లో పులుల సంఖ్య పెరుగుతోంది. గత రెండేళ్లలోనే ఇక్కడ 25 పులులు పెరిగినట్లు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఏకే నాయక్ తెలిపారు. 2022 అంచనా ప్రకారం నల్లమలలో 62 పెద్ద పులులు ఉండగా, ఆ సంఖ్య 87కు చేరినట్లు చెప్పారు. నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్ద పులుల అభయార
ణ్యంలో గుండ్ల బ్రహ్మేశ్వరం, లంకమల, శ్రీవెంకటేశ్వర వన్యప్రాణి, శ్రీపెనుశిల నృసింహస్వామి ప్రాంతాల్లో వీటి ఆవాస విస్తరణ పెరుగుతోందన్నారు.