మహిళలకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం Krishi Sakhi Yojana పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. స్త్రీలు కూడా వ్యవసాయంలో నిమగ్నమయ్యేలా, వారి జీవనోపాధిని మెరుగుపర్చుకునేలా, మహిళలకు ఉద్యోగాలు కల్పించడానికి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీనిని కృషి సఖి ప్రాజెక్ట్ లక్పతి దీదీ యోజన కింద అమలు చేయనున్నారు. దీని ద్వారా మహిళలు సంవత్సరానికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం పొందుతారు.