చీపురు లేబుల్‌పై పోషకాల లిస్ట్‌.. షాకైన నెటిజన్లు

85చూసినవారు
చీపురు లేబుల్‌పై పోషకాల లిస్ట్‌.. షాకైన నెటిజన్లు
ఓ వ్యక్తి కొన్న చీపురు కవర్‌పై పోషకాల వివరాలు, కేలరీలు, ఉపయోగించిన పదార్థాలు ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా దీన్ని పసుపు, మొక్కజొన్న పొట్టు, కనోలా నూనె, ఉప్పు, సున్నం వంటి పదార్థాలను కలిపి తయారుచేసినట్లుగా లేబుల్‌పై రాసి ఉంది. ఓ నెటిజన్‌ ఈ ఫొటోను పోస్ట్‌ చేసి, ‘ఇందులో 150 కేలరీలు కూడా ఉంటాయి బ్రదర్‌’ అంటూ వ్యాఖ్యను జత చేశారు. దీనిని చూసినవారు అవాక్కవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్