ఈపీఎఫ్ఓ చందాదారులు పీఎఫ్ డబ్బులను ఏటీఎమ్ ద్వారా విత్ డ్రా చేసుకునేందుకు కేంద్రం సరికొత్త వ్యవస్థను రూపొందిస్తోంది. దీని కోసం ఈపీఎఫ్ఓ కొత్త మొబైల్ అప్లికేషన్‌ను లాంఛ్ చేయనుంది. ఈ ఏడాది మే-జూన్ నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే ఈపీఎఫ్ఓ 3.0 వెర్షన్ అందుబాటులోకి వచ్చాక పీఎఫ్ ఏటీఎమ్ కార్డులను జారీ చేయనున్నట్లు వెల్లడించింది.