విశ్వక్‌సేన్ హీరోగా రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిబ్రవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ‘ఓహో రత్తమ్మ’ అనే పాట లిరికల్ వీడియో విడుదల చేసింది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ గీతానికి పెంచల్ దాస్ సాహిత్యం అందించారు.