మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
మాటున ఉన్నది ఓ మంచి
సంగతి బయటికి రాదే ఎలా
అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే
బిడియం ఆపేదెలా
ఎదురుగ వస్తే చెప్పక ఆగిపోయే
తలపులు చూపేదెలా
ఒకసారి దరి చేరి ఎదా గొడవేమిటో
తెలపకపోతే ఎలా
మనసున ఉన్నది చెప్పాలనున్నది
మాటలు రావే ఎలా
చింత నిప్పైనా చల్లగా ఉందని
ఎంత నొప్పైనా తెలియలేదని
తననే తలుచుకునే వేడిలో
ప్రేమ అంటేనే తియ్యని బాధని
లేత గుండెల్లో కొండంత బరువని
కొత్తగా తెలుసుకునే వేళలో
కనబడుతోందా నా ప్రియాయమైన నీకు
నా ఎద కోత అని అడగాలని
అనుకుంటూ తన చుట్టూ మరి
తిరిగిందని తెలపకపోతే ఎలా