తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఓ వింత ఆచారం కొనసాగుతోంది. బోధన్ మండలం హంస్స గ్రామంలో ప్రతి ఏడాది
హోలీ రోజును పురస్కరించుకొని గ్రామ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి, ఒకరిపై ఒకరు బలంగా పిడిగుద్దులు కురిపించుకుంటారు. రక్తం వచ్చేలా దాడులు చేసుకుంటారు. ఆ తర్వాత ఆలింగనం చేసుకుంటారు. వినడానికి వింతగా ఉన్నా గ్రామం సుభిక్షంగా ఉండాలని దాదాపు 126 ఏళ్లుగా ఈ ఆచారం వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.