చాలామంది భక్తులు దేవాలయాలకు వెళ్లాక మొదటగా గర్భగుడికి వెళ్ళాలా, నవగ్రహాల చుట్టూ తిరిగి వెళ్ళాలా అనే సందేహాలు భక్తులకు ఉంటాయి. అయితే మొదటగా నవగ్రహాల చుట్టూ తిరిగి కాళ్లు కడుక్కున్న తర్వాత గర్భగుడిలోని దేవుడి దర్శనానికి వెళ్ళాలని పురోహితులు చెబుతున్నారు. అంతేగాని మొదటగా గర్భగుడిలోని దేవుడ్ని దర్శించుకున్నాక నవగ్రహాల చుట్టూ తిరగవద్దని అంటున్నారు. ఒకవేళ అలా తిరిగితే దేవుడి అనుగ్రహం మన మీద ఉండదని సూచిస్తున్నారు.