AP: భవిష్యత్తులో ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే ఏం చేయాలో చేసి చూపిస్తామని నేడు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు అన్నారు. దేశమంతా అధ్యయనం చేసి మహిళల భద్రతకు చట్టాలు చేశామన్నారు. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా లా అండ్ ఆర్డర్ ఉంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో వైసీపీ వాళ్లనే ఉద్యోగులుగా నియమించింది. వారి చేత అసభ్యంగా పోస్టులు పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు.