ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం ఆతిశీ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి సోమవారమే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. భారీ ర్యాలీగా వెళ్లడంతో సమయం దాటిపోయింది. దీంతో ఆమె నామినేషన్ వేయకుండా వెనుదిరిగారు. మంగళవారం నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.