జపాన్ జిమ్మాస్టిక్ టీమ్‌కు ఒలింపిక్స్ ప్రారంభంకాకముందే భారీ షాక్ తగిలింది. జపాన్ జిమ్నాస్టిక్స్ ఉమెన్స్ టీమ్ కెప్టెన్ షోకో మియాటాపై వేటు పడింది. ట్రైనింగ్ క్యాంప్‌లో సిగరెట్ తాగినందుకు బరిలోకి దిగకముందే ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. ధూమపానంతో పాటు మద్యం సేవించడంపై జపాన్ ఒలింపిక్ కమిటీ సీరియస్ అయ్యింది. మియాటాను జట్టు నుంచి తప్పిస్తున్నట్లు జపాన్ జిమ్నాస్టిక్స్ అసోషియేషన్ వెల్లడించింది.