గుండెపోటుకు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. కుటుంబంతో సహా డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న ఆయన 2 రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు స్టంట్ వేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.