శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ఆసియా కప్ మెగాటోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 19.2 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటయ్యింది. అమీన్ (25), తుబా (22) మునీబా అలీ (11) మినహా ఎవరూ రాణించలేదు. చివర్లో ఫాతిమా (22*) మెరుపులు ఆకట్టుకున్నాయి. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లు పడగొట్టగా, రేణుక, పూజా వస్త్రాకర్, శ్రేయంకా పాటిల్ తలో చెరో 2 వికెట్లు పడగొట్టారు.