ఒలింపిక్స్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత పాకిస్థాన్ జావెలిన్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్‌కు అతడి మామ ముహమ్మద్ నవాజ్ గేదెను బహుమతిగా ఇచ్చారు. తమ గ్రామంలో గేదెను బహుమతిగా ఇవ్వడం చాలా విలువైనదిగా, గౌరవప్రదంగా భావిస్తారని నవాజ్ అన్నారు. కాగా పారిస్ ఒలింపిక్స్‌లో 92.97 మీటర్ల త్రోతో అర్షద్ ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టాడు. అనంతరం స్వదేశానికి వెళ్లిన అర్షద్ కు ఘన స్వాగతం లభించింది.