ఉదయం చాలా మంది పరాఠాలను తింటుంటారు. వీటిని తిన్న తరువాత టీ లేదా కాఫీ తాగకూడదు. తాగితే మన శరీరం మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్‌ను శోషించుకోలేదు. దీంతో ఐరన్ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. వైట్ బ్రెడ్ తిన్నాక టీ, కాఫీ తాగడం వల్ల ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. దీర్ఘకాలంలో ఇది టైప్ 2 డయాబెటిస్‌కు కారణం అవుతుంది. చాక్లెట్లు, అరటి పండు తిన్నాక వాటిని తాగినా జీర్ణ వ్యవస్థలో అసౌకర్యం ఏర్పడుతుంది.