వేడుకల వేళ 'నో ఫ్లయింగ్ జోన్' గా పారిస్ (వీడియో)

72చూసినవారు
ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల కోసం ప్రపంచ దేశాల నుంచి క్రీడాకారులు, అతిథులు రావడంతో నిన్న సాయంత్రం పారిస్ ను ’నో ఫ్లయింగ్ జోన్‘గా అధికారులు ప్రకటించారు. నోట్రే – డామ్ కేథడ్రల్ నుంచి 80 నాటికల్ మైళ్ల వ్యాసార్థంలో దాదాపు అన్ని విమానాలను నిషేధించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 నుంచి అర్ధరాత్రి వరకు నిషేధం కొనసాగింది. సైనిక, కస్టమ్స్, పోలీస్, VIP, అత్యవసర విమానాలను మాత్రమే అనుమతించారు.

సంబంధిత పోస్ట్