కేరళలోని వయనాడ్ ప్రకృతి విపత్తు సహాయక చర్యల నుంచి సైన్యం పాక్షికంగా వైదొలగింది. ఈ విషయాన్ని రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి పీఏ మహమ్మద్ రియాస్ వెల్లడించారు. విపత్తు సమయంలో ఎంతో వేగంగా 190 అడుగుల బెయిలీ వంతెనను నిర్మించిన సైన్యానికి ధన్యావాదాలు తెలిపారు. కాగా పదోరోజు సైతం వయనాడ్‌లో గాలింపు చర్యలు కొనసాగాయి. మట్టిచరియల్లో కూరుకుపోయిన మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు జాగిలంతో గాలింపు చేపట్టారు.