రామ్ చ‌ర‌ణ్‌కు ప‌వ‌న్ అభినంద‌న‌లు

1499చూసినవారు
రామ్ చ‌ర‌ణ్‌కు ప‌వ‌న్ అభినంద‌న‌లు
హీరో రామ్ చరణ్‌కు వేల్స్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆయన బాబాయ్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేస్తూ చరణ్‌కు అభినందనలు తెలిపారు. "గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందిన చరణకు గౌరవ డాక్టరేట్ దక్కడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. డాక్టరేట్ స్ఫూర్తితో చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేసి మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నా." అని ప‌వ‌న్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్