పెద్దపల్లి జిల్లా కోర్టు భవన నిర్మాణానికి రూ. 81 కోట్లు మంజూరు
పెద్దపల్లి జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణానికి రూ. 81 కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే విజయరమణరావు ఒక ప్రకటనలో తెలిపారు. 10+2 కోర్టు కాంప్లెక్స్ తో పాటు ఫ్యామిలీ కోర్టు, పోక్సో పోర్ట్ భవనాలను కూడా నిర్మించనున్నారని ఆదివారం వివరించారు. పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కోర్టు ఏర్పడిందని, ఆ కోర్టు ప్రస్తుతం పాత కోర్టు భవనంలో కొనసాగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.