ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు

167చూసినవారు
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు
ట్రాఫిక్ సిఐ కె. ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని లారీ యజమానులకు, డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ట్రాఫిక్ ఏసీపీ బాలరాజు హాజరయ్యారు. సిఐ కె. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. యజమానులకు, డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. భారీ వాహనాల వలన ప్రమాదం జరిగితే భారీ స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంటుందని.. లారీ డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్