నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే: రామగుండం సీపీ

1468చూసినవారు
నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులే: రామగుండం సీపీ
కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను.. రామగుండం కమిషనరేట్ పరిధిలో కచ్చితంగా అమలు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లాక్డౌన్ పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటికి రావద్దన్నారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులు, మీడియాతో పాటు వ్యవసాయ అనుబంధ సంస్థలకు మాత్రమే లాక్ డౌన్ నుండి మినహాయింపు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి రవీందర్, ఏసిపి సారంగపాణి, సిఐ ప్రదీప్, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్