ఇంకా ప్రజల వద్దే రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు : ఆర్బీఐ

85చూసినవారు
ఇంకా ప్రజల వద్దే రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు : ఆర్బీఐ
ప్రజల వద్ద నుండి రావాల్సిన మొత్తం రూ.2 వేల నోట్లలో దాదాపు 97.87 శాతం మాత్రమే తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయని RBI సోమవారం ప్రకటించింది. ఇంకా రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది. 2023 మే 19న చలామణి నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. నాడు చలామణిలో ఉన్న ఈ నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్