అసిడిటీ తో బాధపడేవారు ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తింటే అల్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. మరోపక్క చర్మ సమస్యలతో బాధపడేవారు కూడా పచ్చి వెల్లుల్లిని తినకపోవడమే మంచిది. సర్జరీ జరిగిన వారు పచ్చి వెల్లుల్లిని తినకూడదు, ఒకవేళ తింటే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. వీరితోపాటుగా, రక్తహీనత, తక్కువ రక్తపోటు ఉన్నవారు కూడా పచ్చి వెల్లుల్లిని తినకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.