AP: తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి గురువారం ఉదయం విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేయగా.. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించలేమని కేంద్రం వెల్లడించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.