'పీఎం కిసాన్' సాయం మరో రూ.2 వేలు పెంపు!

365136చూసినవారు
'పీఎం కిసాన్' సాయం మరో రూ.2 వేలు పెంపు!
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుందని తెలుస్తోంది. ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం కింద ఇచ్చే సాయాన్ని మరో రూ.2 వేలు పెంచనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ప్రస్తుతం ఇస్తున్న రూ.6 వేలు సాయం రూ.8 వేలకు పెరగనుంది. ఇప్పుడు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య 16వ విడత సాయాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.