యువకుడిని కొట్టి దుర్భాషలాడిన పోలీస్.. వీడియో వైరల్

567చూసినవారు
ఓ ఫిర్యాదుదారుడితో ఓ పోలీసు దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 2023లో దొంగతనానికి గురైన తన బైక్‌కి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం పోలీస్ స్టేషన్‌కి వచ్చిన యువకుడిపై హెడ్ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడు. అతడిపై చేయి చేసుకుని దుర్భాషలాడాడు. ఈ వీడియో వైరల్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ హేమంత్ శుక్లాని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగింది.

సంబంధిత పోస్ట్