యుపిలో గోహత్య నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఓ మహిళ ఇంట్లో గొడ్డు మాంసం నిల్వ చేస్తున్నారని పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో నలుగురు పోలీసులు ఆ ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసి భయాందోళనకు గురై 55 ఏళ్ల మహిళ మృతి చెందింది. "ప్రభుత్వం నిషేధించిన దేన్నీ మేము నిల్వ చేయలేదని చెప్పినా పోలీసులు వినలేదు. వారి చర్య వల్లే మా అమ్మ చనిపోయింది” అని మృతురాలి కొడుకు చెప్పారు. బిజ్నోర్ ఎస్పీ ఆదేశాలతో సదరు కానిస్టేబుళ్లు ఈ తనిఖీలు చేపట్టారు.