హోలీ పండుగపై చేసిన వ్యాఖ్యలతో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ చిక్కుల్లో పడ్డారు. 'సెలబ్రిటీ మాస్టర్ చెఫ్' అనే వంట రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా ఆమె వ్యవహరించారు. ఇటీవల ఓ ఎపిసోడ్‌లో 'హోలీ అనేది చాప్రీ ప్రజలందరికీ ఇష్టమైన పండుగ' అని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆమెపై న్యాయవాది అలీ కాశిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.