AP: శ్రీశైల క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులే కాకుండా ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుండి వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. తెల్లవారు జాము నుండి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండి అలంకార దర్శనాలు చేసుకుంటున్నారు. అలాగే ముడుపులు చెల్లించేందుకు వస్తున్న భక్తులకు అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి మాల విరమణ ఇరుముడి సమర్పణలు చేయిస్తున్నారు