ఆగస్టు 5న ఆర్జీ కర్ ఆసుపత్రిలో అత్యాచారం, హత్య జరిగిన క్రైమ్ సీన్ వద్ద తీసిన ఫోటో వైరల్ కావడంతో అందులో ఎవరెవరు ఉన్నారనే దానిపై కోల్‌కతా పోలీసులు వివరణ ఇచ్చారు. అక్కడ ఉన్నవారిలో డిటెక్టివ్ డిపార్ట్మెంట్ ఏసీపీ, వీడియోగ్రాఫర్, ఫోరెన్సిక్ ఆఫీసర్, వేలి ముద్ర నిపుణుడు, సాక్ష్యులు ఉన్నారని పేర్కొన్నారు. వారందరికీ అక్కడ ఉండటానికి అనుమతి ఉందని వివరించారు. విచారణ పూర్తయ్యాక ఆ ఫోటో తీసినట్లు చెప్పారు.