హీరో మంచు మనోజ్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ఇవాళ మంచు మనోజ్ కుంటుంబ సమేతంగా హైదరాబాద్ నుంచి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ర్యాలీతో వెళ్లడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఎవ్వరినీ అనుమతించడంలేదు. గేట్లను కూడా మూసివేశారు. యూనివర్సిటీలోనికి వెళ్లేందుకు అనుమతి లేదని మనోజ్‌కు పోలీసులు చెప్పడంతో వెనుతిరిగారు.