బిహార్‌లో షాకింగ్ ఘటన జరిగింది. వైశాలిలోని జలాల్‌పూర్ గంగ్టి పంచాయతీలో ఓ పోలీసును ప్రజలు పరుగెత్తించి దారుణంగా కొట్టారు. ఇటీవల మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని పోలీసులు పట్టుకొని కొట్టడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. పోలీసులు వీరి నుంచి తప్పించుకోగా ఒక పోలీస్ మాత్రం గ్రామస్తుల చేతికి చిక్కాడు. దీంతో అతడిని దారుణంగా కొట్టారు.