సంక్రాంతి వరకే కూటమి ప్రభుత్వానికి సమయం: బొత్స

78చూసినవారు
సంక్రాంతి వరకే కూటమి ప్రభుత్వానికి సమయం: బొత్స
సీఎం చంద్ర‌బాబు జ‌మిలి ఎన్నికలకు సిద్ధం కావాలనే వ్యాఖ్య‌ల‌పై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ విమ‌ర్శ‌లు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తే ఈ ప్రభుత్వం కాలం రెండున్నర ఏళ్లు అని అర్థం అవుతుందన్నారు. అందుకే సంక్రాంతి వరకు కూటమి ప్రభుత్వానికి సమయం ఇద్దామనుకుంటున్నామ‌న్నారు. ఈ ప్రభుత్వానికి సమయం తక్కువగా ఉన్నందున ఎన్నికల హామీల అమలు కోసం డిమాండ్ చేస్తున్నామ‌ని, హామీలు ఎప్పుడు నుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రజల తరపున వైసీపీ డిమాండ్ చేస్తోంద‌న్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్