తెలంగాణలో విద్యార్థుల కోసం ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం పాలసీ తయారు చేయాలని విద్యా కమిషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం విద్యా కమిషన్, విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణ సాధ్యంగా ఉండాలని సూచించారు. ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం ఎంత ఖర్చయినా వెనకాడబోమన్నారు. ఉత్తమ విద్యార్థులను తీర్చిద్దడమే తమ లక్ష్యమన్నారు.