నెలసరిలో అధిక రక్తస్రావం, ప్రసవంలోనూ రక్తం పోవడం, పోషకాహార లోపం, ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక వ్యాధులు, గర్భధారణ సమస్యలు, జన్యులోపాలు... వంటి కారణాలవల్ల పురుషుల్లో కన్నా మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. ముఖ్యంగా గర్భిణులకి ఐరన్ ఎక్కువ మొత్తంలో కావాలి. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలూ తరచూ రక్తహీనతతో బాధపడుతుంటారు. అందుకే... మహిళలతోపాటు పిల్లలూ ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం తప్పనిసరి.