రక్తంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాన్ని గీసిన విద్యార్థి (వీడియో)

71చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం చిత్రాన్ని ఓ విద్యార్థి తన రక్తంతో గీశాడు. తణుకు మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థి వెంకట హరిచరణ్.. తన రక్తంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రాన్ని గీశాడు. అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమంలో పవన్ వస్తారని భావించి, ఈ చిత్రాన్ని అక్కడికి తీసుకొచ్చాడు. కానీ పవన్ రాకపోవడంతో మంత్రి కందుల దుర్గేష్‌కు అందజేశారు. తన జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన హరిచరణ్, కొంత రక్తంతో ఈ చిత్రం వేసినట్లు తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్