రక్తహీనత సర్వ సాధారణ సమస్య. వయసు, జాతి, లింగభేదం తేడా లేదు. పసికందుల దగ్గర నుంచి పండు ముదుసలి వరకూ.. ఎవరికైనా రావొచ్చు, ఎప్పుడైనా రావొచ్చు. అయినా దీనిపై ఇప్పటికీ అవగాహన తక్కువే. కొందరిని ఇదేమీ పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. మందులకు త్వరగానూ స్పందించొచ్చు. కానీ కొందరిని తీవ్రంగా వేధించొచ్చు చికిత్సకు లొంగకుండా ప్రాణాల మీదికీ తేవొచ్చు. కాబట్టి రక్తహీనత (ఎనీమియా) గురించి తెలుసుకొని ఉండటం మంచిది.