రక్తహీనత అంటే ఏమిటి?

78చూసినవారు
రక్తహీనత అంటే ఏమిటి?
రక్తం ద్వారా ఆక్సిజన్‌ను శరీర భాగాలకు చేర్చే హిమోగ్లోబిన్ ఉత్పత్తితోపాటు కణాలన్నీ ఆరోగ్యంగా ఉండేందుకూ ఐరన్ కావాలి. సాధారణంగా ఆహారం ద్వారా తీసుకున్న ఐరన్‌ను జీర్ణాశయగోడల కణాలు గ్రహిస్తాయి. అక్కడ నుంచి రక్తంలోని ట్రాన్స్ఫెర్రిన్ అనే ప్రొటీన్‌తో కలిసి కాలేయానికి చేరుతుంది. అక్కడ పెర్రిటిన్ రూపంలో నిక్షిప్తమై రక్తకణాల తయారీ కోసం ఎముకమజ్జకి అవసరమైనప్పుడు చేరుతుంటుంది. ఒకవేళ ఏ కారణంతోనైనా ఐరన్ లోపిస్తే... శరీరభాగాలకు ఆక్సిజన్ అందక ఆయా భాగాల పనితీరు దెబ్బతింటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్