పీరియడ్స్ కారణంగా మహిళల్లో దాదాపు 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇందులో ఐరన్ లోపం ఒక ప్రధాన కారణమని WHO తెలిపింది. మెచ్యూరిటీ పొందని బాలికల్లో కూడా 27 శాతం మంది బాలికలకు ఐరన్ లోపం ఎక్కువ ఉన్నట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 6 నుంచి 59 నెలల వయస్సు పిల్లలలో 40 శాతం, గర్భిణీ స్త్రీలలో 37 శాతం. 15 నుంచి 49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 30 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని అంచనా వేసింది.