కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకాల కింద తులం బంగారం ఇస్తామన్న హామీని అమలు చేయకపోగా.. రూ.1,00,016 ఆర్థిక సాయాన్ని అందజేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట ఈ సమస్య తీవ్రంగా ఉందట. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. చెక్కులు మంజూరైనా దాదాపు 14,865 మందికి ఇవ్వకుండా పెండింగ్ పెట్టడం గమనార్హం.