ద్రావణాలను కలిపే సమయంలో డబ్బాపై ఉన్న సూచనలు పాటించి, శుభ్రమైన నీటినే వినియోగించాలి. చేతులకు గ్లౌజులు ధరించాలి. తలకు టోపీ, ముఖానికి మాస్కు, కళ్లజోడు పెట్టుకోవాలి. ఆ సమయంలో గుట్కా, పాన్‌మసాల తినడం, సిగరెట్ కాల్చడం వంటివి చేయొద్దు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో పిచికారీ చేస్తే డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశముంది. పిచికారీ పూర్తయిన తర్వాత చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రం చేసుకొని, క్షేత్రం నుంచి ఇంటికి వెళ్లిన అనంతరం తప్పనిసరిగా తలస్నానం చేయాలి.