నీటి వసతి కలిగిన రైతులు తొలకరి వర్షాన్ని ఉపయోగించుకొని పిల్లి పెసర, జనుము, జీలుగ పంటలను వేసి భూసారాన్ని పెంచుకోవాలి. ముందుగానే దుక్కులు దున్నుకుంటే చీడపీడలు, కలుపు మొక్కలను నివారించడమే కాకుండా నేల వర్షపునీటిని గ్రహిస్తుంది. మొక్కజొన్న కత్తెర పురుగు నివారణకు కిలో విత్తనానికి 60 మి.లీ. సయాంట్రానిలిప్రోల్ థయోమిథాక్సామ్‌తో విత్తనశుద్ధి చేసుకుంటే కత్తెర పురుగుబారి నుంచి కాపాడుకోవచ్చు.