కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి నట్వర్ సింగ్ మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. నట్వర్ ఎన్నో ఉన్నత పదవులను అలంకరించారని తెలిపారు. ఆయన గొప్ప దౌత్యవేత్త, అత్యుత్తమ పార్లమెంటేరియన్ అని కొనియాడారు. నట్వర్ మృతి బాధాకరమన్న రాష్ట్రపతి.. ఆయన కుటుంబసభ్యులకు, మిత్రులకు, అనుచరులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.