వర్షాకాలంలో గొర్రెలకు ఎక్కువగా నీలి నాలుక వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెల మూతి, పెదవులు, చిగుళ్లు, నాలుక వాపుతో పాటు వీటిపై పుండ్లు ఏర్పడతాయి. ఈ వ్యాధి సోకకుండా.. వైరస్ వ్యాప్తికి కారణమయ్యే దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. గొర్రెల షెడ్ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ వ్యాధి సోకితే యాంటి బయాటిక్ మందులు వాడాలి. పుండ్లపై ఒక శాతంతో ఉన్న పోటాషియం పర్మాంగనేట్‌ను రుద్దలి. మేతగా అంబలితో పాటు రాగి గంజిని అందించాలి.