విశ్వాస పరీక్షలో నేపాల్ కొత్త ప్రధానిగా నియమితులైన కేపీ శర్మ ఓలి నెగ్గారు. పార్లమెంటులో నిర్వహించిన బలపరీక్షలో ఆయన సునాయాసంగా విజయం అందుకున్నారు. పార్లమెంటు ప్రతినిధుల సభలో మొత్తం 263 మంది సభ్యులు ఉండగా.. కేపీ శర్మ ఓలి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 188 ఓట్లు పడ్డాయి. ఆయనకు వ్యతిరేకంగా కేవలం 74 ఓట్లు వచ్చాయి. ఒక సభ్యుడు గైర్హాజరయ్యారు.