ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు సునీల్ పాల్ అదృశ్యమైనట్లు ఆయన భార్య ముంబైలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఓ షోకు హాజరైన అనంతరం తన భర్త కనిపించకుండా పోయారని, ఇంటికి రాలేదని, అతడి ఫోన్ అందుబాటులో లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే, సునీల్ స్వయంగా ముంబై పోలీసులను సంప్రదించాడు. తన ఫోన్ పనిచేయలేదని, అందుకే తనను ఎవరూ చేరుకోలేకపోయారని వివరించాడు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధృవీకరించారు.